విజయసాయిరెడ్డి, జగతి, భారతిలకు సుప్రీంకోర్టు నోటీసులు!
- అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఈడీ విచారణ ఆపాలని హైకోర్టు ఆదేశం
- హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఈడీ
- సెప్టెంబర్ 5లోగా సమాధానం చెప్పాలని ప్రతివాదులకు నోటీసులు
జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కు సుప్రీం కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఈడీ విచారణ నిలిపివేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు... ట్రయల్ కోర్టును ఆదేశించింది. సీబీఐ ఛార్జిషీట్లపై తీర్పు వెలువడిన తర్వాత ఈడీ విచారణ చేపట్టాలని, ఒకవేళ రెండు దర్యాఫ్తు సంస్థలు విచారణను సమాంతరంగా జరిపితే సీబీఐ తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ తీర్పు ఉండాలని హైకోర్టు ఆదేశించింది.
దీనిని ఈడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈడీ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం సెప్టెంబర్ 5వ తేదీలోగా సమాధానం చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న విజయసాయి రెడ్డి జగతి, భారతి సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది.