విజయ్ దేవరకొండ ఈ గండం గట్టెక్కాల్సిందే!
- వరుస ఫ్లాపులతో ఉన్న విజయ్ దేవరకొండ
- సక్సెస్ కోసమే చాలా కాలంగా వెయిటింగ్
- బరిలోకి దిగడానికి రెడీ అవుతున్న 'ఖుషీ'
- చేతిలో మరో రెండు ప్రాజెక్టులు
సినిమా పరంగా ఎలాంటి బలమైన నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువమంది హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరుగా కనిపిస్తాడు. ఎలాంటి నేపథ్యం లేకుండా హీరోగా రావడమనే తీరు వేరేగా ఉంటుంది. కానీ విజయ్ దేవరకొండ ఒక ఉప్పెనలా వచ్చేశాడు. వస్తూ వస్తూనే యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యాడు. అంతకుముందు .. ఆ తరువాత తెలుగులో ఈ స్థాయి దూకుడుతో వచ్చినవారెవరూ లేరు.
విజయ్ దేవరకొండ తన ఖాతాలో కొన్ని మంచి హిట్స్ వేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, అంతకుముందు వచ్చిన సక్సెస్ ల ప్రభావంతోనే కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. గతంలో మాటల యుద్ధం పట్ల ఎక్కువ ఆసక్తిని చూపుతూ వచ్చిన విజయ్ దేవరకొండ, ఆ తరువాత చేతలపైనే ఫోకస్ పెట్టాడు. అయితే ఈ లోగానే ఆయనకి వరుస పరాజయాలు ఎదురయ్యాయి.
2018 నుంచి ఇంతవరకూ ఆయన హిట్ లేదు. ఒక సినిమాకి మించి మరొక సినిమా ఫ్లాప్ బాటపట్టాయి. ఇలాంటి ఒక పరిస్థితిలో ఆయన నుంచి రావడానికి 'ఖుషీ' రెడీ అవుతోంది. ఈ సినిమా ఫలితం ఆయనకి ఒక పరీక్షా సమయమే .. ఈ గండాన్ని తప్పకుండా ఆయన గట్టెక్కవలసిందే. ఈ సినిమా హిట్ అయితే ఆయన క్రేజ్ .. మార్కెట్ మళ్లీ దార్లో పడిపోతాయి. ఆ తరువాత ప్రాజెక్టులుగా గౌతమ్ తిన్ననూరి .. పరశురామ్ సినిమాలు ఉన్నప్పటికీ, 'ఖుషీ' హిట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి.