ఈపీఎఫ్ఓ లో ఆఫీసర్ ఉద్యోగాలు.. ఖాళీలు ఎన్నంటే..!

  • నోటిఫికేషన్ విడుదల చేసిన ఈపీఎఫ్ఓ
  • 86 జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ పోస్టులు
  • రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం
జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖలలో మొత్తం 86 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఈ పోస్టుల భర్తీ కోసం అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన రెండేళ్ల కాలానికి ఈ నియామకాలు చేపడుతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం చెల్లించనున్నట్లు పేర్కొంది.

పోస్టులు, ఖాళీలు: జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (86)
రిజర్వేషన్: అన్‌ రిజర్వ్‌డ్‌ 23, ఈడబ్ల్యూఎస్‌ 12, ఓబీసీ 28, ఎస్సీ 14, ఎస్టీ 9, పీడబ్ల్యూబీడీ 4
వయోపరిమితి: అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 సంవత్సరాలకు మించకూడదు
సడలింపులు: ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు- 30 ఏళ్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు 35 ఏళ్లు, ఇతర వెనుకబడిన తరగతులు 33 ఏళ్లు
జీతం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400

అర్హతలు
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీలో మాస్టర్స్ డిగ్రీ, దీనిలో ఇంగ్లీషు తప్పనిసరి లేదా ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌గానైనా చదివి ఉండాలి
  • లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ, దీనిలో హిందీ తప్పనిసరి లేదా ఎలక్టివ్‌ గానైనా చదివి ఉండాలి.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి హిందీ టు ఇంగ్లీషుకు అనువాదం లేదా హిందీ నుంచి ఇంగ్లీషుకు అనువాదంలో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి

అనుభవం
ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ అండర్‌టేకింగ్‌ సంస్థలో హిందీ నుంచి ఇంగ్లీషుకు అనువాదం లేదా హిందీ నుంచి ఇంగ్లీషుకు అనువాదంలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి

దరఖాస్తు విధానం
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో జూలై 13లోపు దరఖాస్తు చేసుకోవాలి


More Telugu News