గువాహటిలో దారుణం.. తల్లీకుమార్తెలపై 8 మంది సామూహిక అత్యాచారం
- మే 17న ఘటన
- బాధిత యువతి బధిరురాలు కావడంతో చెప్పుకోలేకపోయిన వైనం
- ఇరుగుపొరుగు ఫిర్యాదుతో వెలుగులోకి
- నిందితుల్లో నలుగురి అరెస్ట్
అస్సాంలోని గువాహటిలో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన మహిళ, ఆమె కుమార్తెపై 8 మంది దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. మే 17న ఈ ఘటన జరగ్గా బాధిత యువతి బధిరురాలు కావడంతో విషయం ఇన్నాళ్లూ బయటకు రాలేదు. అత్యాచారం అనంతరం నిందితులు తల్లీకుమార్తెల ప్రైవేటు భాగాలపై కారంపొడి జల్లి పరారయ్యారు.
గువాహటిలోని సత్‌గావ్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. తొలుత ఈ ఘటనను మసిపూసి మారేడు కాయ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ దారుణం వెలుగులోకి వచ్చాక మాత్రం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
వివాహం విచ్ఛిన్నమైన తర్వాత బాధిత యువతి (22) తల్లితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో నిందితుల్లో ఒకడైన అరుణ్ ప్రధాన్ అలియాస్ లూటే ప్రధాన్ (55) బాధితురాలి తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. విషయం ప్రధాన్ కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఇవి మరింత పెరగడంతో అరుణ్ ప్రధాన్ కుమారుడు అమిత్‌తోపాటు మరో ఏడుగురు కలిసి బాధితుల ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఇద్దరిపైనా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి ప్రైవేటు భాగాలపై కారంపొడి చల్లి పరారయ్యారు. విషయం తెలిసిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృహ కోల్పోయి పడివున్న తల్లికుమార్తెలను పోలీసులు గువాహటి మెడకల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది.