చిన్న గ్రామంలో టీకొట్టు నడుపుకుంటూ జీవిస్తున్న యూపీ సీఎం యోగి సోదరి

  • ఉత్తరాఖండ్‌లోని ఫౌడీలో టీకొట్టు నడుపుతున్న శశి పాయల్
  • అత్యంత నిరాడంబర జీవనం
  • ప్రతి ఏటా రక్షాబంధన్ నాడు సోదరుడికి రాఖీ పంపిస్తానన్న శశి
ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి. పేరు శశి పాయల్. సీఎం సోదరంటే ఆ రేంజే వేరేగా ఉంటుంది. కానీ, ఆమె మాత్రం వేరే రాష్ట్రంలో ఓ చిన్న టీ దుకాణం పెట్టుకుని అత్యంత నిరాడంబరంగా జీవిస్తున్నారు. యూపీ మాజీ ఎమ్మెల్యే దినేశ్ చౌదరి ఆమె వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

ఉత్తరాఖండ్‌లోని ఫౌడీలో మాతా భువనేశ్వరి ఆలయ సమీపంలో శశి పాయల్ టీ దుకాణం నడుపుకుంటారు. ఫౌడీలోనే జన్మించిన యోగి ఆదిత్యనాథ్‌కు ఏడుగురు తోబుట్టువులు కాగా శశి అందరికంటే పెద్దవారు. యోగి ఐదో సంతానం. 1994లో యోగి సన్యసించారు. శశి కొఠార్ గ్రామానికి చెందిన పురాన్‌సింగ్‌ను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. రక్షాబంధన్ రోజున ప్రతి ఏటా తన సోదరుడికి రాఖీ పంపిస్తుంటానని శశి తెలిపారు.


More Telugu News