నంది అవార్డుల ఎంపిక చిత్తశుద్ధితో చేయాలని జగన్ చెప్పారు: పోసాని
- ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ గా కొనసాగుతున్న పోసాని
- నియామకం సమయంలో సీఎం జగన్ ఏం చెప్పారో వెల్లడించిన వైనం
- మనవాడని, మన కాంపౌండుకు చెందినవాడని చూడొద్దని జగన్ చెప్పారని వెల్లడి
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, నంది అవార్డుల వ్యవహారంలో సీఎం జగన్ తనతో ఏమని చెప్పారో పోసాని మీడియా సమావేశంలో వెల్లడించారు.
"నేను ఎఫ్ డీసీ చైర్మన్ అయ్యాక జగన్ గారు ఏం చెప్పారంటే... నువ్వు సినిమా వాడివి కాబట్టే నీకు ఈ పోస్టుం ఇచ్చాం అని చెప్పారు. నువ్వు సిన్సియర్ గా చేస్తావనే నిన్ను ఈ పదవిలో నియమించాం అన్నారు. అంతకుముందు, నువ్వు నంది అవార్డుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, అవార్డులు సరిగా ఇవ్వడంలేదని ప్రెస్ మీట్లలో మాట్లాడడం నేను చూస్తూనే ఉన్నాను అని జగన్ గారు చెప్పారు. వీడు మనవాడు, వీడు మన కాంపౌండు అని కాకుండా సిన్సియర్ గా ఎలా చేస్తావో అలాగే చెయ్యమని చెప్పారు" అని పోసాని వివరించారు.