తెలుగు రాష్ట్రాల్లో డబుల్ సెంచరీ కొట్టిన టమోటా.. అక్కడ రూ.60కే!
- తమిళనాడులో రూ.60కే కిలో టమోటా
- రేషన్ దుకాణాల్లో అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం
- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 111 దుకాణాల్లో అందుబాటులోకి
దేశ వ్యాప్తంగా టమోటా ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా ధర సెంచరీ నుంచి డబుల్ సెంచరీ వరకూ వెళ్లింది. సామాన్యులకు ఇబ్బందిగా మారిన ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చౌకధరల దుకాణాల్లో కిలో టమోటాను రూ. 60కే అందుబాటులోకి తెచ్చింది. చెన్నై నగరంలోని 82 రేషన్ దుకాణాలు సహా రాష్ట్రవ్యాప్తంగా 111 దుకాణాల్లో మంగళవారం నుంచి కిలో టమోటా రూ.60కి విక్రయించనున్నట్లు సహకార శాఖ మంత్రి పెరియకరుప్పన్ ప్రకటించారు.
టమోటా ధరల పెరుగుదలపై దృష్టి సారించిన తమిళనాడు ప్రభుత్వం, సహకారశాఖ చెన్నైలో నడుపుతున్న 65 గ్రీన్ హౌస్ దుకాణాల్లో కిలో రూ.60కి విక్రయించడం ప్రారంభించింది. దీంతో, ఆ దుకాణాల ముందు వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఒక్కో వినియోగదారుడికి 2 నుంచి 3 కిలోలు మాత్రమే విక్రయిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం చెన్నైతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన దుకాణాల్లో ఈనెల 4న మంగళవారం నుంచి రేషన్ దుకాణాల్లో టమోటా కిలో రూ.60కి విక్రయించనున్నట్లు తెలిపారు. ధరలు తగ్గే వరకు రేషన్ దుకాణాల్లో విక్రయాలు కొనసాగిస్తామని మంత్రి ప్రకటించారు.