ఫారెక్స్ ఉల్లంఘన కేసు.. ఈడీ ఎదుట హాజరైన టీనా అంబానీ
- నిన్న అనిల్ అంబానీ, నేడు టీనా అంబానీ హాజరు
- ఫెమా చట్టంలోని పలు సెక్షన్ల కింద అనిల్ అంబానీపై కేసు
- ఆయనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ గతేడాది బాంబే హైకోర్టు ఆదేశాలు
విదేశీ మారకపు నిబంధనల ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య, బాలీవుడ్ సీనియర్ నటి టీనా అంబానీ ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ చట్టం (ఫెమా)లోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో నిన్న అనిల్ అంబానీ వాంగ్మూలం ఇచ్చారు. నేడు టీనా ఈడీ ఎదుట హాజరయ్యారు.
యస్ బ్యాంక్ లోన్ కిక్‌బ్యాక్స్ కేసుకు సంబంధించి 2020లోనూ అనిల్ అంబానీ ఈడీ ఎదుట హాజరయ్యారు. అయితే, ఆయన ఏ కేసులో నిన్న ఈడీ ఎదుట హాజరయ్యారన్నది తెలియాల్సి ఉంది. రూ. 420 కోట్ల పన్ను ఎగవేత కేసులో అనిల్ అంబానీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ గతేడాది సెప్టెంబరులో బాంబే హైకోర్టు ఆదేశించింది.