ఆప్ ఎమ్మెల్యేలకు వినూత్న శిక్ష విధించిన కోర్టు

  • పనివేళలు ముగిసే వరకూ కోర్టులోనే ఉండాలని ఆర్డర్
  • ఇద్దరికీ రూ. పది వేల చొప్పున జరిమానా విధించిన న్యాయమూర్తి
  • 2015లో బురారీ పోలీస్ స్టేషన్ పై దాడి కేసులో తీర్పు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలకు ఢిల్లీ కోర్టు సోమవారం వినూత్న శిక్ష విధించింది. కోర్టు పనివేళలు ముగిసే వరకు కోర్టు ప్రాంగణం దాటకూడదని ఆదేశించింది. 2015లో దాఖలైన కేసును విచారించిన న్యాయస్థానం.. ఆప్ ఎమ్మెల్యేలు అఖిలేశ్ త్రిపాఠి, సంజీవ్ ఝాలకు ఈ శిక్ష విధించింది.

బురారీ పోలీస్ స్టేషన్ పై 2015 లో జరిగిన దాడి కేసులో ఎమ్మెల్యేలను నిందితులుగా తేల్చిన మెజిస్టీరియల్ కోర్టు జనవరిలో వారికి జైలు శిక్ష విధించింది. త్రిపాఠికి ఆరు నెలలు, సంజీవ్ ఝా కు మూడు నెలల శిక్ష విధించింది. అయితే, ఎమ్మెల్యేల అప్పీల్ తో ఈ తీర్పును సోమవారం సమీక్షించిన స్పెషల్ జడ్జి గీతాంజలి.. ఎమ్మెల్యేలకు విధించిన జైలు శిక్షను రద్దు చేశారు. జడ్జీలు తమ కుర్చీలో నుంచి లేచే వరకూ కోర్టులోనే ఉండాలని శిక్ష విధించారు. దీంతో పాటు ఎమ్మెల్యేలు ఇద్దరూ చెరో పదివేలు జరిమానా కట్టాలని ఆదేశించారు.


More Telugu News