ఒక్కొక్కరూ రోజుకు రూ.114 కోట్లు.. విస్తుగొలిపేలా అపరకుబేరుల ఆర్జన
- ఈ ఏడాది తొలి ఆరు నెలలు బిలియనీర్లకు లాభించిందన్న బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ
- ఒక్కో బిలియనీర్ రోజువారీ సగటు ఆర్జన 14 మిలియన్ డాలర్లని వెల్లడి
- స్టాక్ మార్కెట్లలో కొత్త ఊపుతో బిలియనీర్ల ఆస్తులూ పెరిగాయన్న సంస్థ
ప్రపంచ అపరకుబేరుల రోజువారీ సగటు ఆదాయం రూ.114 కోట్లని అమెరికా వార్త సంస్థ బ్లూమ్‌బర్గ్ తాజాగా వెల్లడించింది. తాము రూపొందించిన అపరకుబేరుల జాబితా బ్లూమ్‌బర్గ్ మిలియనీర్స్ ఇండెక్స్‌లోని ఒక్కొక్కరూ గత ఆరు నెలల్లో రోజుకు సగటున 14 మిలియన్ డాలర్ల చొప్పున ఆర్జించారని వెల్లడించింది. కొవిడ్ సంక్షోభం తరువాత ఈ ఏడాదే మిలియనీర్లకు కాలం కలిసి వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు భయాలను తోసిరాజని ఇన్వెస్టర్లు పెట్టుబడులు కుమ్మరించడంతో ఈసారి స్టాక్ మార్కెట్‌కు కొత్త ఊపువచ్చింది. దీంతో, అపరకుబేరుల ఆర్జన కూడా పెరిగింది. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అన్న అంచనాల నడుమ టెక్ సంస్థల షేర్లు దూసుకుపోయాయి.
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ సంపద ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 96.6 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. అదే సమయంలో ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఆస్తుల విలువ 58.9 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.
మరోవైపు, భారత మిలియనీర్లలో ఒకరైన అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదాని ఆస్తుల విలువ ఈ ఆరు నెలల్లో 60.2 బిలియన్ డాలర్ల మేర పతనమైంది. జనవరి 27న ఆయన ఆస్తుల విలువ ఏకంగా 20.8 బిలియన్ డాలర్ల మేర పడిపోయిన విషయం తెలిసిందే.