తేజస్వీయాదవ్‌పై సీబీఐ చార్జ్‌షీట్.. కేబినెట్ నుంచి డిస్మిస్ చేయాలని సుశీల్ మోదీ డిమాండ్

  • 2004-2009 మధ్య ల్యాండ్స్ ఫర్ జాబ్ కుంభకోణం
  • ఆ కాలంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలు ప్రసాద్ యాదవ్
  • అవినీతిని సహించబోనన్న నితీశ్ వ్యాఖ్యలను గుర్తు చేసిన సుశీల్ మోదీ
‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, మాజీ ముఖ్యమంత్రులు లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుశీల్ యాదవ్ స్పందించారు. తేజస్వీని వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అవినీతిని సహించేది లేదంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

2004-2009 మధ్య లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్స్ ఫర్ జాబ్ కుంభకోణం జరిగినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. పశ్చిమ మధ్య మండలంలో గ్రూప్-డి నియామకాల్లో అవినీతి జరిగినట్టు చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. రెండో చార్జ్‌షీట్‌లో మరో 14 మంది పేర్లను కూడా ప్రస్తావించింది.


More Telugu News