నా పాత్రను చూసుకుని నేనే భయపడ్డాను: జగపతిబాబు
- తెలంగాణ నేపథ్యంలో సాగే 'రుద్రంగి'
- భీమ్ రావ్ దేశ్ ముఖ్ పాత్రలో జగపతిబాబు
- ఆయన పాత్ర పవర్ఫుల్ అంటున్న డైరెక్టర్
- ఈ నెల 7వ తేదీన సినిమా విడుదల
జగపతిబాబు ఇంతకుముందు చాలానే విలన్ రోల్స్ చేశారు. అటు గ్రామీణ నేపథ్యంలో విలనిజంలోను .. కార్పొరేట్ విలనిజంలోను ఆయన తన మార్కును చూపించారు. ఆయన తాజా చిత్రంగా ఈ నెల 7వ తేదీన 'రుద్రంగి' రానుంది. మమతా మోహన్ దాస్ - విమలా రామన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఈ సినిమా టీమ్ బిజీగా ఉంది.
తాజా ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను 'భీమ్ రావ్ దేశ్ ముఖ్' పాత్రలో కనిపిస్తాను. ఇలా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక దొర పాత్రను పోషించడం ఇదే ఫస్టు టైమ్. నా పాత్రకి ఒక చిత్రమైన మేనరిజం పెట్టారు. అందువలన నా పాత్రను చూసుకుంటే నాకే భయం వేసింది" అని అన్నారు.
దర్శకుడు అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో ఒక కొత్త జగపతిబాబును చూస్తారు. అంత పవర్ఫుల్ గా ఆయన పాత్రను డిజైన్ చేయడం జరిగింది. తన పాత్ర .. నేపథ్యం గురించి తెలుసుకుంటూ, అందుకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్ ను జగపతిబాబు సెట్ చేసుకున్నారు. 'రుద్రంగి' చుట్టూ కథ తిరుగుతూ ఉన్నప్పటికీ, జగపతిబాబుగారి పాత్ర ప్రేక్షకులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.