ఏపీలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు
- రాష్ట్రానికి వర్ష సూచన
- జులై 3 నుంచి 5 వరకు వర్షాలు
- మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
- అక్కడక్కడ పిడుగులు పడతాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
ఏపీలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ డాక్టర్ అంబేద్కర్ వెల్లడించారు. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.
నేడు (జులై 3) నెల్లూరు, అన్నమయ్య, కడప, బాపట్ల, అల్లూరి, గుంటూరు, కృష్ణా, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని... రేపు (జులై 4) పల్నాడు, అల్లూరి, మన్యం, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నంద్యాల, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు.
జులై 5న అనంతపురం, కర్నూలు, అనకాపల్లి, మన్యం, నంద్యాల, శ్రీ సత్యసాయి, అల్లూరి, కాకినాడ, పల్నాడు, విజయనగరం, ఎన్టీఆర్, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు.
అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.