భారత క్రికెట్ జట్టులో ఒకేసారి ముగ్గురు తెలుగమ్మాయిలకు చోటు

  • సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, బారెడ్డి అనూషకు అవకాశం
  • ఈ నెల 9 నుంచి బంగ్లాదేశ్ పర్యటనకు భారత్
  • మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ లో పోటీ
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళా క్రికెటర్లు తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఆడనున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్.. ఈ నెల 9వ తేదీ నుంచి బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ల కోసం జట్లను ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు అమ్మాయిలకు చోటు దక్కడం విశేషం. 

చాన్నాళ్ల నుంచి జట్టులో ఉన్న సబ్బినేని మేఘన టీ20 జట్టులో చోటు నిలుపుకొంది. పేస్ ఆల్ రౌండర్ అంజలి శర్వాణి రెండు జట్లకు ఎంపికైంది. స్పిన్ ఆల్ రౌండర్ బారెడ్డి అనూష తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చింది. ఆమె కూడా రెండు జట్లలో చోటు దక్కించుకుంది. ఈ పర్యటనలో భాగంగా భారత మహిళలు మీర్పూర్‌‌ వేదికగా ఈ నెల 9, 11, 13వ తేదీల్లో మూడు టీ20లు, 16, 19, 22వ తేదీల్లో మూడు వన్డేల్లో బంగ్లాతో తలపడనున్నారు. 

భారత టీ20 జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (కీపర్), హర్లీన్ డియోల్, దేవిక అవేద, ఉమా చెత్రీ (కీపర్), అమంజోత్ కౌర్, S. మేఘన, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, అంజలి శర్వాణి, మోనికా పటేల్, రాశి కనోజియా, అనూషా బారెడ్డి, మిన్ను మణి.

భారత వన్డే జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (కీపర్), హర్లీన్ డియోల్, దేవికా వైద్య, ఉమా చెత్రీ (కీపర్), అమంజోత్ కౌర్, ప్రియా పునియా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్ , అంజలి శర్వాణి, మోనికా పటేల్, రాశి కనోజియా, అనూషా బారెడ్డి, స్నేహ రాణా.


More Telugu News