బోయపాటి - రామ్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్!

  • రామ్ హీరోగా రూపొందుతున్న బోయపాటి సినిమా 
  • తాజాగా 'స్కంద' అనే టైటిల్ ఖరారు 
  • మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో సాగే కథ 
  • కథానాయికగా అలరించనున్న శ్రీలీల 
  • సెప్టెంబర్ 15వ తేదీన ఐదు భాషలలో విడుదల  
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. తన కెరియర్లో రామ్ చేస్తున్న ఫస్టు పాన్ ఇండియా సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కాస్త గట్టిగానే ఉన్నాయి. 

 ఈ సినిమాలో రామ్ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ కంటెంట్ ఉంటుందనే విషయాన్ని ఇంతవరకూ వదులుతూ వచ్చిన పోస్టర్స్ చెప్పాయి. అలాంటి ఈ సినిమాకి పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేయనున్నారనే వార్త, అభిమానుల్లో ఆసక్తిని పెంచుతూ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి 'స్కంద' అనే టైటిల్ ను ఖరారు చేసి, ఆ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ ను వదిలారు. బోయపాటి మార్క్ .. రామ్ ఎనర్జీకి తగినట్టుగానే ఈ టైటిల్ ఉంది. తప్పకుండా ఇది జనంలోకి దూసుకుపోయేలా ఉంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 


More Telugu News