ప్రభాస్​ ఫ్యాన్స్​కు అలర్ట్.. ఈ నెల 6న సలార్ టీజర్‌‌​

  • అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
  • ఆదిపురుష్ తో నిరాశ పరిచిన ప్రభాస్
ఆదిపురుష్ డిజాస్టర్ తర్వాత ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ ఇప్పుడు సలార్ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు. కేజీఎఫ్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరగుతోంది. కీలక పాత్రలపై చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పాటు అనేక విమర్శలు ఎదుర్కోవడంతో నిరాశలో ఉన్న ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపేందుకు సలార్ చిత్ర బృందం నుంచి  ట్రీట్‌ రానుంది.  ఈ నెల 6న సలార్ టీజర్ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఆరో తేదీన ఉదయం 5.12 గంటలకు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ యూబ్యూట్ చానెల్లో https://www.youtube.com/@HombaleFilms/videos టీజర్ రిలీజ్ కానుంది  ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు.


More Telugu News