ఇన్ స్టాలోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ

  • క్లారిటీ ఇచ్చిన నాగబాబు
  • వరుస సినిమాలతో బిజీబిజీగా పవన్
  • ఈ నెలాఖరున బ్రో విడుదల
పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ త్వరలో ఇన్ స్టాలో అభిమానులను పలకరించనున్నారు. ఇన్ స్టాగ్రాంలోకి పవన్ ఎంట్రీ ఇవ్వనున్నారని ఆయన సోదరుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన తన ఇన్ స్టా అకౌంట్ లో ఓ పోస్టు పెట్టారు. అయితే, పవర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడనేదానిపై మాత్రం నాగబాబు క్లారిటీ ఇవ్వలేదు. ఓవైపు వరుసగా సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ విశ్రాంతి తీసుకోకుండా ‘బ్రో’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పూర్తిచేసినట్లు సమాచారం.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న బ్రో, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయి. పవన్, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం బ్రో ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించగా.. ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.


More Telugu News