ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య
- అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
- పని ఒత్తిడే ప్రాణం తీసిందన్న ఆయన కుమార్తె భవ్య
- తన వల్ల కావడం లేదని చెబుతూ తనవద్ద బాధపడేవారని ఆవేదన
అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, పని ఒత్తిడే తన తండ్రి ప్రాణం బలిగొందని ఆయన కుమార్తె భవ్య కన్నీరు పెట్టుకున్నారు. ఆనందరావు గతంలో తిరుపతి, కడపలో పనిచేశారని, అయినా ఎక్కడా ఒత్తిడికి గురికాలేదని చెప్పారు. తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, తన వల్ల కావడం లేదని చెప్పుకుని పలుమార్లు తన వద్ద బాధపడ్డారని భవ్య తెలిపారు.