జనగర్జన సభ వేదిక వద్దకు చేరుకున్న రాహుల్ గాంధీ... పొంగులేటికి కాంగ్రెస్ కండువా కప్పిన అగ్రనేత
- ఖమ్మం పట్టణంలో నేడు కాంగ్రెస్ జనగర్జన సభ
- భారీ తరలివచ్చిన జనాలు
- గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకున్న రాహుల్
- రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి తదితరులు
- భట్టి, సీతక్కలను అభినందించిన రాహుల్
ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు జనగర్జన సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడ్నించి హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చారు. హెలిప్యాడ్ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ సభావేదిక వద్దకు చేరుకున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర పూర్తిచేసుకుని వచ్చిన భట్టిని రాహుల్ అభినందించారు. అటు, ఎమ్మెల్యే సీతక్కను కూడా భుజం తట్టి అభినందించారు. రాహుల్ రాకతో సభా ప్రాంగణం వద్ద కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
ఇక, సభావేదికపై పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. పొంగులేటితో పాటు ఇంకా మరికొందరు నేతలకు కూడా కాంగ్రెస్ కండువా కప్పారు. ఈ చేరికల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ఉత్సాహంగా నడిపించారు.
అంతకుముందు, సభావేదికపైకి చేరుకున్న రాహుల్ గాంధీని ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ముద్దాడారు.