బాబాయ్‌కి షాక్.. శరద్‌పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు.. ఎన్సీపీలో చీలిక!
- 29 మంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు అజిత్ పవార్
- షిండే ప్రభుత్వానికి మద్దతు.. ప్రభుత్వంలో చేరే అవకాశం
- మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సాయంత్రం అజిత్ ప్రమాణ స్వీకారం!
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. శరద్‌పవార్ నేతృత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిట్టనిలువునా చీలింది. శరద్‌పవార్‌పై తన అన్న కొడుకు అజిత్‌పవార్ తిరుగుబాటు చేశారు. పార్టీలోని 29 మంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు.
మొత్తం 30 మంది ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నర్‌ను ఈ రోజు కలిశారు. వీరంతా సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్‌పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సీఎం షిండే కూడా రాజ్ భవన్‌కు చేరుకున్నట్లు తాజా సమాచారం.
మహారాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తానని ఇటీవల అజిత్ పవార్ చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో ఆదివారం తన అధికార నివాసం దేవగిరిలో ఆయన సమావేశమయ్యారు. తర్వాత రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.