అనూరిజంతో 30 ఏళ్ల అతిచిన్న వయసులోనే మరణించిన యూట్యూబ్ ఫిట్‌నెస్ స్టార్
- సోషల్ మీడియాలో జోస్తెటిక్‌గా చిరపరిచితుడైన జో లిండ్నెర్
- ఫిట్‌నెస్‌కు సంబంధించి ట్రిక్స్, టిప్స్ చెబుతూ ఫాలోవర్లను సంపాదించుకున్న వైనం
- ఇన్‌స్టాలో 8.5 మిలియన్లు, యూట్యూబ్‌లో 9.40 లక్షల మంది ఫాలోవర్లు
- అనూరిజంతో మరణించిన లిండ్నెర్
జర్మనీకి చెందిన యూట్యూబ్ ఫిట్‌నెస్ స్టార్, జోస్తెటిక్స్‌గా చిరపరిచితుడైన జో లిండ్నెర్ 30 ఏళ్ల అతి చిన్న వయసులోనే మరణించాడు. శుక్రవారమే అతడు మరణించగా తాజాగా ఆయన ప్రియురాలు ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఫిట్‌నెస్‌కు సంబంధించి క్రమం తప్పకుండా ట్రిక్స్, టిప్స్ చెప్పే జో లిండ్నెర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 8.5 మిలియన్లు, యూట్యూబ్‌లో 9.40 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
లిండ్నెర్ ప్రియురాలు నిచా ఇన్‌స్టా పోస్టు ప్రకారం.. రక్తనాళాలు ఉబ్బడం (అనూరిజం) కారణంగా జో మరణించాడు. అనూరిజం అనేది రక్తనాళాల గోడలో బలహీనత కారణంగా రక్తనాళాలు ఉబ్బిపోతాయి. బలమైన, ప్రపంచంలోనే అద్భుతమైన, నమ్మశక్యం కాని వ్యక్తిగా లిండ్నెర్‌ను ఆమె అభివర్ణించింది. ఆయనతో తాను కలిసి ఉన్నానని, తన కోసం నెక్లెస్ కూడా తయారుచేయించాడని రాసుకొచ్చింది. తనకు మెడనొప్పిగా ఉందని మూడు రోజుల క్రితం చెప్పాడని అయితే, అప్పటికే ఆలస్యమైందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, జూన్‌లో సహ యూట్యూబర్ బ్రాడ్లీ మార్టిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిండ్నెర్ మాట్లాడుతూ తాను కండరాల వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పాడు.