చేతిలో గరుడ రేఖ.. చనిపోయాడనుకుంటే లేచి కూర్చున్నాడు!

  • కర్ణాటకలోని గదగ జిల్లా హీరేకొప్ప గ్రామంలో వెలుగు చూసిన ఘటన
  • మద్యం మత్తులో పామును పట్టుకున్న వ్యక్తి
  • చేతిలో గరుడ రేఖ ఉన్న తనను పాము కాటేయదని ప్రకటన
  • పాము నాలుగు సార్లు కాటేయడంతో కుప్పకూలిన వైనం
  • అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా మళ్లీ లేచి కూర్చున్న వ్యక్తి
  • ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితుడు
కర్ణాటకలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరణించాడనుకుని కుటుంబసభ్యులు అంత్యక్రియలకు సిద్ధమైతే అతడు లేచి కూర్చున్నాడు. గదగ జిల్లా హీరేకొప్ప గ్రామానికి చెందిన సిద్ధప్ప ఇటీవల మద్యం మత్తులో ఓ పామును పట్టుకున్నాడు. తన చేతిలో గరుడ రేఖ ఉందని, పాము తనను కాటేయదని చెబుతూ పామును చేతుల్లోకి తీసుకున్నాడు. తొలిసారి ఆ పాము అతడి చేతుల్లోంచి జారీ పోయింది. మరోమారు అతడు పామును పట్టుకోవడంతో అది ఏకంగా నాలుగు సార్లు కాటేసింది. 

ఇదేమీ పట్టించుకోని సిద్ధప్ప పామును తీసుకుని గ్రామం వెలుపలకు వెళతూ మార్గమధ్యంలోనే కుప్పకూలిపోయాడు. అతడు చనిపోయాడని భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా సిద్ధప్ప లేచి కూర్చున్నాడు. దీంతో, షాకైపోయిన కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సిద్ధప్ప కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.


More Telugu News