టీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. 10 శాతం రాయితీతో రూ.100 వరకు ఆదా
- విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణించేవారికి రాయితీ
- జులై 2 నుండి ఆగస్ట్ 15 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడి
- విజయవాడ రూట్లో రూ.50 వరకు, బెంగళూరు రూట్లో రూ.100 వరకు ఆదా అవుతుందని ట్వీట్
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. విజయవాడ, బెంగళూరు మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టిక్కెట్‌పై పది శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించేవారు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై పది శాతం డిస్కౌంట్ ఇస్తారు. ఈ రాయితీ సేవలు జులై 2, ఆదివారం నుండి అందుబాటులోకి వస్తాయి. అయితే ఇది పరిమిత రాయితీ. ఆగస్ట్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో 10% రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. రానుపోను ఒకేసారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10% రాయితీ ఉంటుందని, ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ రూట్లో రూ.50 వరకు, బెంగళూరు రూట్లో రూ.100 వరకు ఆదా అవుతుందని తెలిపింది.