ఆ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరిక
- ఎన్నికల కోసం ఫేక్ గ్యారెంటీతో పార్టీలు సిద్ధమవుతున్నాయని ఆగ్రహం
- అబద్ధపు వాగ్దానాలతో కాంగ్రెస్ సహా పలు కుటుంబ పార్టీలు ఒక్కటవుతున్నాయని ధ్వజం
- నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎరాడికేషన్ మిషన్ 2047 లాంచ్
ఎన్నికల కోసం ఫేక్ గ్యారెంటీలతో కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యప్రదేశ్ షాడోల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. రాజకీయంగా తమకే గ్యారెంటీ లేని కొన్ని పార్టీలు కొత్త పథకాలు, ఫేక్ గ్యారెంటీలతో సిద్ధమవుతున్నాయన్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అబద్ధపు వాగ్దానాలతో కాంగ్రెస్ సహా పలు కుటుంబ పార్టీలు ఒక్కటవుతున్నాయన్నారు.
ఇప్పటికే ఇచ్చిన ఎన్నికల హామీని ఆయా పార్టీలు అమలు చేయడం లేదన్నారు. గతంలో ఒకరినొకరు తిట్టుకున్న పార్టీలు ఇప్పుడు పాట్నా వేదికగా ఒక్కటయ్యాయని దుయ్యబట్టారు. వారి కలయికకు కూడా గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు. హామీల విషయంలో బీజేపీ భిన్నంగా ఉంటుందని, హామీ ఇస్తే అమలు చేస్తామన్నారు. పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యమని హామీ ఇచ్చి, నెరవేర్చామన్నారు. అలాగే రైతులకు పీఎం కిసాన్ పేరిట పెట్టుబడి సాయం హామీ ఇచ్చి, నెరవేర్చామన్నారు. కాగా, ఈ సందర్భంగా ప్రధాని మోదీ అనీమియాను పారద్రోలే లక్ష్యంతో నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎరాడికేషన్ మిషన్ 2047ను లాంచ్ చేశారు.