హైదరాబాద్ విద్యార్థులకు శుభవార్త, మెట్రో రైల్ స్టూడెంట్ పాస్

  • ఈ పాస్ తో 20 ట్రిప్పుల ఛార్జీతో 30 ట్రిప్పులు ప్రయాణించవచ్చునని తెలిపిన మెట్రో
  • కాలేజీ ఐడీ కార్డును చూపించి మెట్రో కార్డును పొందవచ్చు
  • స్మార్ట్‌ కార్డు రూపంలో స్టూడెంట్ పాస్
విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. విద్యార్థుల కోసం కొత్తగా స్టూడెంట్ పాస్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ పాస్ తో విద్యార్థులు ఇరవై ట్రిప్పుల ఛార్జీతో 30 ట్రిప్పులు ప్రయాణించవచ్చునని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ట్వీట్ చేసింది.

మెట్రో స్టూడెంట్ పాస్‌ని పరిచయం చేస్తున్నాము. 
'హైదరాబాదీ విద్యార్థులకు మెట్రో మార్గంలో ప్రయాణించడానికి అంతిమ, అనుకూలమైన సాధనం.
మీ కళాశాల ఐడీ కార్డ్‌ని చూపడం ద్వారా సరికొత్త స్టూడెంట్ పాస్ మెట్రో కార్డ్‌ను పొందండి. 20 రైడ్‌లకు రీఛార్జ్ చేసి, 30 రోజుల్లో 30 రైడ్‌లను పొందండి' అంటూ ట్వీట్ చేసింది.

కాగా, స్టూడెంట్‌ పాస్‌ స్మార్ట్‌ కార్డు రూపంలో అందుబాటులో ఉంటుంది. ఈ పాస్‌ సహాయంతో నెల రోజుల్లో 30 రైడ్‌కు అవకాశం ఉంటుంది. పాస్‌ను తొమ్మిది నెలల వ్యాలిడిటీతో ఇవ్వనున్నారు. అంటే ఈ ఏడాది జులై 1 నుండి 2024 మార్చి 31 వరకు ఈ పాస్‌ అందుబాటులో ఉంటుంది. జేఎన్టీయూ, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, విక్టోరియా మెమోరియల్‌, దిల్‌సుఖ్‌ నగర్‌ స్టేషన్లలో కాలేజీ ఐడీ కార్డు చూపించి ఈ మెట్రో పాస్‌ను పొందవచ్చు.


More Telugu News