షిరిడీ ఆలయానికి 74 మంది జవాన్లతో అదనపు భద్రత
- బాంబే హైకోర్టు అనుమతితో ఆలయ గర్భగుడి, ఐదు ప్రవేశ ద్వారాల వద్ద రక్షణ
- క్యూ కాంప్లెక్స్, చెకింగ్ పాయింట్, ఆలయ పరిసరాల్లో విధుల్లో వందమంది పోలీసులు
- అదనంగా 600 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది
మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయానికి మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ (ఎంఎస్ఎఫ్) అదనపు భద్రతను కల్పించింది. భద్రత కోసం 74 మంది ఎంఎస్ఎఫ్ జవాన్లు మోహరించారు. బాంబే హైకోర్టు అనుమతితో ఆలయ గర్భగుడి, ఐదు ప్రవేశ ద్వారాల వద్ద జవాన్లు రక్షణ కల్పించనున్నారు.
వీరితో పాటు వందమంది పోలీసులు క్యూ కాంప్లెక్స్, చెకింగ్ పాయింట్, ఆలయ పరిసరాల్లో విధులు నిర్వహిస్తారు. షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ సొంతగా మరో ఆరువందల మందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంది. వీరు కాంప్లెక్స్, ప్రసాదాలయం, భక్తి నివాస్ సహా వివిధ ప్రాంతాలలో ఉంటారు.
కాగా, షిరిడీలో సీఐఎస్ఎఫ్ అధికారులతో భద్రత కల్పించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మే 1న స్థానికులు బంద్‌కు పిలుపునిచ్చారు. స్థానిక మంత్రి చొరవతో దీనికి ముగింపు పలికారు.
ఈ క్రమంలో ఇప్పుడు మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ తో షిరిడీ ఆలయానికి భద్రతను కల్పించారు. 74 మంది కోసం షిరిడీ ట్రస్ట్ నెలకు రూ.21 లక్షల ఖర్చును భరించాల్సి ఉంటుంది.