ధోనీ ఎత్తుగడలు చూసి మతిపోయిందన్న కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు
- ధోనీ ఫీల్డింగ్ ప్లాన్ చూసి వెంకటేశ్ అయ్యర్ ఫిదా
- బంతిని వేసేందుకు బౌలర్ సిద్ధమవుతుండగానే ధోనీ ఫీల్డింగ్ సెట్ చేశాడని వెల్లడి
- మరుసటి బంతికి బౌలర్ చేతికి క్యాచ్ ఇచ్చిన బ్యాట్స్‌మన్
మహేంద్ర సింగ్ ధోనీ మాస్టర్ మైండ్, ప్లానింగ్‌ను చూసి షాకయ్యానని కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ధోనీ చేసే ఫీల్డింగ్ సెటప్ అద్భుతమని కొనియాడాడు. ఐపీఎల్‌లో చెన్నైతో మ్యాచ్ సందర్భంగా తాను, మరొకరం క్రీజులో ఉన్నామని, తమ కోసం ధోనీ ఫీల్డింగ్ ను సెట్ చేసిన విధానం చూసి తనకు ఆశ్చర్యం వేసిందని చెప్పాడు. తాను అప్పటికే నాన్-స్ట్రైకింగ్ లో ఉన్నానని, స్ట్రైకర్ కోసం షార్ట్ థర్డ్ మ్యాన్, కవర్స్ వద్ద ఒక్కొక్కరిని సెట్ చేశాడన్నాడు.
బంతిని వేసేందుకు బౌలర్ సిద్ధమవుతుండగా ధోనీ మరోసారి ఫీల్డింగ్ ను సెట్ చేశాడన్నాడు. మరో ఫీల్డర్ ను రప్పించి ఓ ప్లేస్‌లో ఉంచాడని, మరుసటి బంతికే ఎక్కడైతై ఫీల్డర్ ఉన్నాడో అక్కడికే క్యాచ్ ఇచ్చి తమ బ్యాటర్ పెవిలియన్ చేరుకున్నాడని గుర్తు చేసుకున్నాడు.
దీంతో తాను ఆశ్చర్యపోయానని, ధోనీ అలా ఫీల్డింగ్ సెట్ చేసిన మరుసటి బంతికే అలా జరగడం ఏమిటని, ఓ మూడు లేదా నాలుగు బంతుల తర్వాత అయినా జరగవచ్చు కదా అని అనుకున్నానని చెప్పాడు. ఇదే ధోనీ మాస్టర్ మైండ్ పవర్ అని తనకు అర్థమైందన్నాడు.
తాను కూడా అలాగే అవుటయ్యానని, నమ్మశక్యంకాని రీతిలో అవుట్ కావడంతో వెనక్కి తిరిగి చూడగా, సదరు ఫీల్డర్ ఉండాల్సిన చోట కాకుండా వేరేచోట ఉన్నట్లుగా అనిపించిందన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం తాను ఈ విషయం గురించి ధోనీని అడిగానని, అయితే తాను ఓ షాట్ కొట్టిన తర్వాత ఫీల్డింగ్ ను సెట్ చేసినట్లు చెప్పాడని తెలిపాడు. అందుకు నేను వావ్ అనకుండా ఉండలేకపోయానన్నాడు. అంత తక్కువ సమయంలో ఎలా ఆలోచిస్తారో అర్థంకాక తలపట్టుకున్నానని వెంకటేశ్ అయ్యర్ చెప్పాడు.