మాతో బీజేపీ నేతలు కూడా టచ్‌లో ఉన్నారు: తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి ఠాక్రే
- ఖమ్మం సభ తర్వాత ఇతర పార్టీలకు చెందిన చాలామంది కాంగ్రెస్ లోకి వస్తారని వెల్లడి
- జులై 2 సభ తర్వాత మిగతా వారి చేరికలు ఉంటాయి
- కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక తమ బలం పెరిగిందన్న ఠాక్రే
ఖమ్మం సభ తర్వాత తమ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన చాలామంది నేతలు వస్తారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి చెందిన నేతలు కూడా తమతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. జులై 2 నాటి ఖమ్మం సభ తర్వాత మిగతావారి చేరికలు ఉంటాయన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా, తెలంగాణలోను తమ బలం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఆర్భాటం తప్ప ఏమీ కనిపించడం లేదని, మహారాష్ట్రలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య మంచి సమన్వయం ఉందన్నారు.