అమెరికాలోని ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో అగ్నిప్రమాదం

  • లాస్ ఏంజెలెస్ లోని స్టూడియోలో అగ్ని ప్రమాదం
  • ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో ప్రమాదం సంభవించినట్టు భావిస్తున్న అధికారులు
  • సిబ్బందిని ఇంటికి వెళ్లిపోవాలని కోరిన స్టూడియో యాజమాన్యం
ప్రపంచ ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో అగ్నిప్రమాదం సంభవించింది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఉన్న ఈ స్టూడియోలో ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపకదళ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తును ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగలు ఆ ప్రాంతంలో అలముకున్నాయి. ప్రమాదం నేపథ్యంలో స్టూడియోలో పని చేస్తున్న సిబ్బందిని ఇంటికి వెళ్లిపోవాలని యాజమాన్యం కోరింది.


More Telugu News