తన అనుచరుల శవాలు కూడా మిగలవన్న వార్నింగ్ పై పొంగులేటి స్పందన

  • చట్టం మీ చుట్టమా కేసీఆర్ అని ప్రశ్నించిన పొంగులేటి
  • తనకు, తను అనుచరులకు ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత అని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు భయపడమన్న పొంగులేటి
మాజీ ఎంపీ పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను విడుదల చేసిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై పొంగులేటి స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. చట్టం మీ చుట్టమా? అని ప్రశ్నించారు. ఎంత మందిని చంపుతారో చంపండి మేమూ చూస్తామని ఛాలెంజ్ చేశారు. తనకు కానీ, తన కార్యకర్తలకు కానీ ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత అని చెప్పారు. 

తన అనుచరుల్లో ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటానని పొంగులేటి అన్నారు. బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని... తన కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కొంత మంది పోలీసు అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని... వారంతా గులాబీ షర్టులు వేసుకోవాలని అన్నారు. ఇలాంటి అధికారులు రేపు శిక్షకు గురికాక తప్పదని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాను పోరాడుతానని తెలిపారు.


More Telugu News