టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్11
- మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న బీసీసీఐ
- వెస్టిండీస్ తో టూర్ నుంచి అమల్లోకి రానున్న ఒప్పందం
- ఇప్పటిదాకా స్పాన్సర్ గా ఉన్న బైజూస్
టీమిండియాకు కొత్త స్పాన్సర్ వచ్చింది. ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 పురుషుల, మహిళల జట్టుకు రానున్న మూడేళ్ల పాటు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఇప్పటిదాకా స్పాన్సర్ గా ఉన్న బైజూస్ స్థానంలో డ్రీమ్11 స్పాన్సర్‌గా ఉంటుందని బీసీసీఐ శనివారం అధికారిక ప్రకటన చేసింది. అయితే, డ్రీమ్11తో ఆర్థిక ఒప్పందం గురించి బీసీసీఐ పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఈనెల 12 నుంచి వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ నుంచి భారత క్రికెటర్ల జెర్సీలపై డ్రీమ్11 లోగో ఉంటుంది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఇండియా తన తొలి టెస్టు సిరీస్‌ను ఆడనుంది. బైజూస్ స్థానంలో డ్రీమ్11 స్పాన్సర్ చేయనుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ డ్రీమ్11కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇటీవల టీమిండియా కిట్ స్పాన్సర్‌గా అడిడాస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 2028 వరకు ఈ ఒప్పందం ఉంటుంది.