ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. కీలకమైన యూసీసీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం
- జులై 20 నుంచి ఆగస్ట్ 11 వరకు వర్షాకాల సమావేశాలు
- కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు జరిగే అవకాశం
- ఉమ్మడి పౌరస్మృతి, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది. జులై 20 వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆగస్ట్ 11 వరకు సమావేశాలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన ట్విట్టర్ వేదికగా విన్నవించారు. అన్ని అంశాలపై ఫలవంతమైన చర్చ జరిగేలా అందరూ వ్యవహరించాలని కోరారు.
ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును (యూసీసీ) ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లును ప్రవేశ పెడితే పార్లమెంటు అట్టుడికిపోవడం ఖాయం. మరోవైపు ఆప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ఆర్డినెన్స్ (గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ ఆర్డినెన్స్) బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో జరిగే అవకాశాలు ఉన్నాయి.