తలకోన జలపాతంలో ఈతకొడుతూ బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన యువకుడు
- విహారయాత్ర కోసం కర్ణాటక నుంచి వచ్చిన యువకుడు
- యువకుడిని రక్షించేందుకు రంగంలోకి పోలీసులు
- చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం
తిరుపతి జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన తలకోన జలపాతంలో ఈత కొడుతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని రక్షించే ప్రయత్నం చేసినా వీలుకాకపోవడం, చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ ఉదయం తీస్తామని చెప్పారు.
రాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడిని కర్ణాటకలోని మంగళూరుకు చెందిన సుమన్ (23)గా గుర్తించారు. విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి వచ్చాడు. నిన్న జలపాతంలోకి దిగి ఈత కొడుతుండగా రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు.
రాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడిని కర్ణాటకలోని మంగళూరుకు చెందిన సుమన్ (23)గా గుర్తించారు. విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి వచ్చాడు. నిన్న జలపాతంలోకి దిగి ఈత కొడుతుండగా రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు.