హెచ్‌డీఎఫ్‌సీ విలీనానికి ముందు వాటాదారులకు దీపక్ పరేఖ్ కీలక లేఖ

  • వాటాదారులను ఉద్దేశించి దీపక్ పరేఖ్ రిటైర్మెంట్ లేఖ
  • ఉత్తేజకరమైన భవిష్యత్తు దిశగా దూసుకు పోతున్నామని వ్యాఖ్య
  • హెచ్‌డీఎఫ్‌సీ చరిత్ర తుడిచివేయలేనిదని, వారసత్వం కూడా ముందుకు తీసుకు వెళ్తుందని ఆశాభావం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో హెచ్‌డీఎఫ్‌సీ విలీనానికి ముందు హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వాటాదారులను ఉద్దేశించి కీలక లేఖను రాశారు. ఇందులో తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. పరేఖ్ శుక్రవారం కంపెనీ పెట్టుబడిదారులకు రాసిన ఒక లేఖలో రిటైర్మెంట్ ప్రకటించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. నాలుగున్నర దశాబ్దాలుగా సంస్థలో పని చేస్తున్న పరేఖ్ బ్యాంకుల విలీనం తర్వాత జూన్ 30న తన పదవికి రాజీనామా చేయనున్నట్లు గతంలోనే తెలిపారు. బ్యాంకుల విలీనం జులై 1వ తేదీ నాటికి అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విలీనానికి ముందు పరేఖ్ రాసిన లేఖలో... భవిష్యత్తు కోసం ఎదురుచూపులు, ఆశలతో హెచ్‌డీఎఫ్‌సీ వాటాదారులకు ఇది నా చివరి సంభాషణ కావొచ్చునని పేర్కొన్నారు. తాము ఇప్పుడు ఉత్తేజకరమైన భవిష్యత్తు దిశగా మరింతగా దూసుకు పోతున్నామని చెబుతున్నానని, తనకు హెచ్‌డీఎఫ్‌సీ అనుభవం అమూల్యమైనదని చెప్పారు. మన చరిత్ర తుడిచివేయలేనిదని, మన వారసత్వం దీనిని అలాగే ముందుకు తీసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News