మోదీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతికి ఉద్ధవ్ థాకరే మద్దతు

  • దేశ ప్రజలందరికీ.. కుల, మతాలకు అతీతంగా ఒకే చట్టం వర్తింపజేసే ఉమ్మడి పౌర స్మృతి
  • మోదీ ప్రభుత్వ ప్రతిపాదనకు ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు
  • మద్దతిస్తాం.. కానీ డ్రాఫ్ట్ వచ్చాక తుది నిర్ణయమన్న సంజయ్ రౌత్
వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, భరణం తదితర అంశాల్లో దేశ ప్రజలందరికీ.. కుల, మతాలకు అతీతంగా ఒకే చట్టం వర్తింపజేసే ఉమ్మడి పౌర స్మృతి ప్రతిపాదనపై ఓ వైపు రాజకీయ దుమారం రేగుతుండగా, మరోవైపు నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతున్న పార్టీల సంఖ్య పెరుగుతోంది. ఎన్డీయేను మినహాయిస్తే... మోదీ వ్యతిరేక కూటమిలోని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మద్దతును ప్రకటించింది. తాజాగా ఉద్దవ్ థాకరే వర్గం శివసేన కూడా ఉమ్మడి పౌర స్మృతికి దాదాపు జై కొట్టింది.

తమ పార్టీ విధానం ఎప్పుడూ ఉమ్మడి పౌర స్మృతికి అనుకూలంగానే ఉంటుందని, అయితే ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత తుది నిర్ణయం ఉంటుందని సంజయ్ రౌత్ ప్రకటించారు. ఈ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టినా తమ పార్టీ మద్దతు ఇస్తుందని మరో నేత ఆనంద్ తెలిపారు. అన్ని భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపుల ద్వారా ఉమ్మడి పౌర స్మృతి బిల్లుపై కేంద్రం ఏకాభిప్రాయాన్నితీసుకు రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇదివరకే కోరింది.


More Telugu News