భీమవరం సభ మధ్యలోకి వచ్చేసిన అంబులెన్స్... అందులో నిజంగానే పేషెంట్లు ఉన్నారా? అని అడిగిన పవన్

  • పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వారాహి యాత్ర
  • భారీ సభ నిర్వహించిన పవన్
  • అంబులెన్స్ కు దారివ్వాలన్న జనసేనాని
  • అందులో పేషెంట్లు ఉన్నారా? లేరా? అంటూ పవన్ సందేహం
జనసేనాని పవన్ కల్యాణ్ భీమవరంలో వారాహి విజయ యాత్ర సభ నిర్వహిస్తుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎంపీ రఘురామకృష్ణరాజు గురించి పవన్ మాట్లాడుతుండగా, సభ మధ్యలోకి ఓ అంబులెన్స్ ప్రవేశించింది. పవన్ సభకు భారీగా వచ్చిన జనసందోహం మధ్యలోంచి ఆ అంబులెన్స్ నిదానంగా కదులుతుండడం గమనించిన పవన్ ఒక్కసారిగా తన ప్రసంగాన్ని ఆపేశారు. అంబులెన్స్ ను వెళ్లనివ్వండి అంటూ కార్యకర్తలకు సూచించారు. ఆ అంబులెన్స్ నిదానంగా వెళుతుండగా, పవన్ స్పందిస్తూ... నిజంగానే అందులో పేషెంట్లు ఉన్నారా? అని పలుమార్లు అడిగారు. అందులో పేషెంట్లు లేరా?... అంటూ నవ్వుతూ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.


More Telugu News