పాన్ తో ఆధార్ అనుసంధానానికి నేడే తుది గడువు
- పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాలని ఎప్పటి నుంచో చెబుతున్న కేంద్రం
- ఇప్పుటికే పలుమార్లు గడువు పెంచుతూ వచ్చిన వైనం
- జూన్ 30తో ముగియనున్న గడువు
- ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డులు జులై 1 నుంచి పనిచేయవంటున్న కేంద్రం
పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేందుకు కేంద్రం ఇప్పుటికే అనేక పర్యాయాలు గడువు పెంచుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల రూ.1000 పెనాల్టీతో పొడిగించిన గడువు నేటితో ముగియనుంది. ఆధార్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులు జులై 1 నుంచి పనిచేయవని కేంద్ర ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
కేంద్ర నిబంధనల ప్రకారం పాన్ కార్డు కలిగివున్న ప్రతి వ్యక్తి ఆదాయ పన్ను చట్టం-1961 ప్రకారం... పాన్ కార్డును ఆధార్ వివరాలతో అప్ డేట్ చేయాల్సిందే.
కాగా, ఆధార్ ను పాన్ కు లింక్ చేయని వారు ఇంకా చాలామందే ఉన్నారని, అందుకే కేంద్రం మరోసారి గడువు పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై కేంద్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.