తెలంగాణ రాజకీయాల్లోకి తమ్మారెడ్డి భరద్వాజ?.. కాంగ్రెస్‌తో చర్చలు!

  • తమ్మారెడ్డి భరద్వాజతో కాంగ్రెస్ అధిష్ఠానం మంతనాలు
  • తెలంగాణ కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై చర్చ జరుగుతున్నట్లు ప్రచారం
  • ఆయనతో టచ్‌లో ఉన్న నేతలు
తమ్మారెడ్డి భరద్వాజ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాత. కేవలం సినిమాల మీదే కాదు.. రాజకీయాలపై కూడా నిక్కచ్చిగా తన అభిప్రాయాలను చెబుతుంటారు. సుదీర్ఘ సినీ ప్రయాణం తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి ఆయన అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ మేరకు ఆయనతో కాంగ్రెస్ అధిష్ఠానం మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే తమ్మారెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పార్టీలో చేర్చుకునే విషయంలో ఆయనతో కాంగ్రెస్‌ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.


More Telugu News