ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ కిలో టమాటా ధర రూ.124
- తెలుగు రాష్ట్రాల్లో రూ.100 తాకిన టమాటా ధర
- మదనపల్లి మార్కెట్ లో సగటున టమాటా ధర రూ.100 నుండి రూ.110
- టమాటా ధరలపై సోషల్ మీడియాలో మీమ్స్
కూరగాయల ధరలు, ముఖ్యంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఆ తర్వాత భారీ వర్షాలు, పంట దిగుబడి తగ్గడం వంటి వివిధ కారణాలతో టమాటా ధర రోజురోజుకు పెరుగుతోంది. దీనికి తోడు వివిధ ప్రాంతాల్లో వేడి గాలులు, భారీ వర్షాలు టమాటా సరఫరాకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. టమాటా ధర తెలుగు రాష్ట్రాల్లో కిలో రూ.100ను తాకింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ లో కిలో టమాటా రికార్డ్ స్థాయికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో టమాటా రూ.124కు చేరుకుంది.
ఈ మార్కెట్ కు సాధారణంగా 1500 టన్నుల టమాట వస్తుంది. కానీ గురువారం అందులో సగం అంటే 750 టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో వ్యాపారులు ఆ టమాటాను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో ధర పెరిగింది. ఏ గ్రేడ్ టమాటా కిలో రూ.106 నుండి రూ.124 మధ్య పలికింది. బీ గ్రేడ్ టమాటా రూ.86 నుండి రూ.105 మధ్య పలికింది. సగటున రూ.100 నుండి రూ.110 పలికినట్లు చెబుతున్నారు. ఇక్కడి నుండి ఉత్తరాది రాష్ట్రాలకు టమాటాను ఎగుమతి చేస్తున్నారని, దీంతో సరఫరా తగ్గినట్లు చెబుతున్నారు.
టమాటా ధరలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వస్తున్నాయి. ట్విట్టర్ లో ఆసక్తికరంగా ట్వీట్ చేస్తున్నారు. టమాటా ఆకాశం మీద ఉందని, ఉల్లిగడ్డ మాత్రమే కాదు టమాటా ధర కూడా కంటనీరు పెట్టిస్తుందని, ఇప్పుడు టమాటా ధర, యాపిల్ ధరతో సమానంగా ఉందంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారు.