ఎవరు ఎవరికి బుల్లెట్ దింపుతారో ప్రజలే డిసైడ్ చేస్తారు: ఎమ్మెల్యే అనిల్ కుమార్‌‌ యాదవ్

  • తన సవాల్‌ను స్వీకరించే దమ్ము లోకేశ్‌‌కు లేదన్న అనిల్
  • జగన్‌తో తన భేటీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • రూ.200 కోట్లు ఖర్చు పెట్టి తన మీద గెలవాలని చూస్తున్నారని వ్యాఖ్య
టీడీపీ నేత నారా లోకేశ్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను విసిరిన సవాల్‌ను స్వీకరించే దమ్ము లోకేశ్‌‌కు లేదని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌తో తన భేటీపై కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వాళ్లు బాత్ రూమ్‌లో ఉండి విన్నట్టు చెబుతున్నారని మండిపడ్డారు. 

‘‘సిల్లీ బచ్చా.. ఆఫ్ టికెట్ లోకేశ్‌కు మాట్లాడటం కూడా రాదు. మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పని చేసిన వారందరూ.. బేసిక్ నాలెడ్జ్ లేని లోకేశ్ వెంట తిరుగుతున్నారు” అని విమర్శించారు. 

రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు ఖర్చు పెట్టి తన మీద గెలవాలని చూస్తున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు. తాను బలమైన అభ్యర్థిని కాబట్టే మాజీ మంత్రి నారాయణను తన మీద పోటీకి దించుతున్నారని చెప్పారు. 2024లో ఎవరికి ఎవరు బుల్లెట్ దింపుతారో ప్రజలే డిసైడ్ చేస్తారని అన్నారు.


More Telugu News