చిన్నారిని కదలకుండా చేసేందుకు ఇల్లాలి వెరైటీ ఐడియా

  • రెండేళ్ల బాలుడిని అట్ట పెట్టెలో కూర్చోబెట్టిన ఇల్లాలు
  • కదలకుండా ఉండేందుకు స్టిక్కర్ తో ప్యాకింగ్
  • ఆ తర్వాత ట్రిమ్మర్ తీసుకుని నున్నగా షేవింగ్
‘మనసు ఉంటే మార్గం ఉంటుంది’ అనే దాన్ని నిజం చేసింది ఓ ఇల్లాలు. మూడేళ్లలోపు పిల్లలు కుదురుగా కూర్చోరు. అస్తమానం అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు. అలాంటి వారిని కుదురుగా కూర్చోబెట్టాలంటే ఏం చేయాలి? ఈ విషయంలో ఓ మహిళకు మంచి ఐడియా తట్టింది. తన రెండేళ్ల బాలుడ్ని ఓ అట్ట పెట్టెలో కూర్చోబెట్టింది. తల బయట ఉండేందుకు వీలుగా బాక్స్ పై భాగంలో కొంత కట్ చేసింది. లోపల కూర్చున్న పిల్లాడు కాళ్లు చాపుకునేందుకు బాక్స్ పక్క భాగంలోనూ కట్ చేసి పెద్ద చిల్లులు పెట్టింది.

బాక్స్ నుంచి బాలుడు బయటకు రాకుండా స్టిక్కర్ తో ప్యాక్ చేసింది. ట్రిమ్మర్ తీసుకుని తలంతా నున్నగా గుండు గీకేసింది. ఈ వీడియోని ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు. చేతులు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో బాలుడు కదలకుండా కూర్చున్నాడు. దీంతో ఆ మహిళ వేగంగా తన పని పూర్తి చేసింది. ఆధునిక సమస్యకు, ఆధునిక పరిష్కారం అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.


More Telugu News