మీరు తాగే, తినే వాటిల్లో ఈ కేన్సర్ కారకం ఉందేమో చూసుకోండి!
- ఆస్పర్ టేమ్ వల్ల కేన్సర్ రావచ్చంటున్న నిపుణులు
- వచ్చే నెలలో దీన్ని ప్రకటించనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
- స్ప్రైట్, డైట్ కోక్ లో ఆస్పర్ టేమ్
ఆర్టిఫీషియల్ స్వీట్ నర్ (కృత్రిమ తీపి పదార్థం) ఆస్పర్ టేమ్ కేన్సర్ కారకం కావచ్చంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వచ్చే నెలలో ప్రకటించనుంది. దీన్ని దీర్ఘకాలం పాటు తీసుకున్నప్పుడు కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం చాలా మంది వినియోగదారులను కలవరపరిచేదే. ఎందుకంటే చాలా ఉత్పత్తుల్లో ఆస్పర్ టేమ్ ను వినియోగిస్తున్నారు. మన దగ్గర ఎక్కువగా పాప్యులర్ అయిన స్ప్రైట్ కూల్ డ్రింక్, కోకకోలా డైట్ కోక్ లో కూడా ఇది ఉంది.
ఆస్పర్ టేమ్ అన్నది పంచదారకు ప్రత్యామ్నాయం. కేలరీలు లేనిది. ఎక్స్ ట్రా షుగర్ ఫ్రీ మార్స్ చూయింగ్ గమ్, జెల్ ఓ షుగర్ ఫ్రీ జెలెటిన్ డిజర్ట్ మిక్స్, ట్రిడెంట్ షుగర్ ఫ్రీ పిప్పర్ మెంట్ గమ్స్ తదితర ఉత్పత్తుల్లో దీన్ని వినియోగిస్తున్నారు. కేన్సర్ ను కలిగించే వాటిని కార్సినోజెనిక్ గా పిలుస్తారు. కార్సినోజెనిక్ లో నాలుగు రకాలుగా చెబుతారు. కచ్చితంగా కేన్సర్ కలిగించే వాటిని కార్సినోజెనిక్ గా, బహుశా కార్సినోజెనిక్ గా, కలిగించొచ్చుగా (పాసిబుల్), నాట్ క్లాసిఫిబుల్ (కలిగించకపోవచ్చు) అని వర్గీకరిస్తారు. ఆస్పర్ టేమ్ ను పాసిబుల్ కార్సినోజెనిక్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించనుంది.
కార్సినోజెనిక్ గా ఇప్పటికే ప్రకటించిన జాబితాలో మద్యం, వాయు కాలుష్యం, బొగ్గు కాల్చినప్పుడు వెలువడే పొగ, పొగతాగడం, పొగతాగిన వారు వదిలిన పొగను పీల్చడం (ప్యాసివ్ స్మోకింగ్), ప్రాసెస్డ్ మీట్ తినడం, ఎక్స్ గామా రేడియేషన్ కు గురి కావడం, కలప దుమ్ము, ఓపియం వినియోగం, ఫార్మల్ డీహైడ్, అల్ట్రా వయలెట్ రేడియేషన్ ఇవన్నీ కూడా కేన్సర్ ను కలిగిస్తాయి. ప్రతి ఒక్కరూ తాము వినియోగించే ఉత్పత్తిలోని ఇంగ్రేడియంట్స్ ను ఒక్కసారి పరిశీలించుకోవడం మంచిది. అందులో ఆస్పర్ టేమ్ ఉంటే దూరం పెట్టడమే మంచిది. కొన్ని ఉత్పత్తులు ఆర్టిఫీషియల్ షుగర్ అని రాస్తున్నాయే కానీ, అందులో ఏదన్నది చెప్పడం లేదు. అలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.