ఉన్నట్టుండి ఎర్రగా మారిపోయిన జపాన్ నది.. కారణం ఇదే!

  • నది రంగు మారడంతో ప్రజల్లో ఆందోళన
  • ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్
  • అది తమపనేనన్న బీర్ ఫ్యాక్టరీ
  • ఫుడ్ కలరింగ్ కోసం ఉపయోగించే రంగు పొరపాటున నదిలో కలిసిందని వివరణ
జపాన్‌లోని నాగో నగరం ప్రజలు ఉదయం లేస్తూనే షాకయ్యారు. అక్కడి నది ఒక్కసారిగా ఎర్రగా మారిపోవడంతో ఏం జరిగిందో అర్థంకాక భయభ్రాంతులకు గురయ్యారు. రక్తం కలిపినట్టుగా ఎర్రగా ఉన్న నది ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. 

సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయిన తర్వాత ఒరియన్ బ్రేవరీస్ అనే బీర్ ఫ్యాక్టరీ స్పందించింది. నది ఎర్రగా మారడానికి కారణమం తామేనని, ఫుడ్ కలరింగ్ కోసం ఉపయోగించే రంగు రెయిన్ గట్టర్ ద్వారా నదిలోకి చేరడంతో అది కాస్తా ఎరుపు రంగును సంతరించుకుందని వివరణ ఇచ్చింది. రంగుతో నది కలుషితమైనందుకు తమను క్షమించాలని వేడుకుంది. దీనిపై స్థానిక ఆరోగ్య అధికారులు కూడా స్పందించారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని, దీనివల్ల పర్యావరణనానికి ఎలాంటి ముప్పు ఉండదని పేర్కొన్నారు.


More Telugu News