భారత్ తో టెస్టులకు పక్కాగా రెడీ అవుతున్న విండీస్
- సన్నాహక శిబిరానికి 18 మందితో జట్టు ఎంపిక
- జులై 12 నుంచి భారత్, విండీస్ మధ్య రెండు టెస్టులు
- డబ్ల్యూటీసీ కొత్త సీజన్ ను ప్రారంభించనున్న భారత్
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో రెండో సారి ఫైనల్లో బోల్తాపడ్డ టీమిండియా.. కొత్త డబ్ల్యూటీసీపై ఫోకస్ పెట్టనుంది. వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ తో డబ్ల్యూటీసీ కొత్త సీజన్ ను ప్రారంభించనుంది. జులై 12 నుంచి జరిగే రెండు టెస్టుల ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టును ముందుగానే ప్రకటించారు. తాజాగా భారత్ తో టెస్టుల కోసం వెస్టిండీస్ పలువురు స్టార్ ఆటగాళ్లు లేకుండా సన్నాహక జట్టును శుక్రవారం ప్రకటించింది. 18 మందితో కూడిన సన్నాహక శిబిరంలో జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్, అల్జారీ జోసెఫ్, రోస్టన్ చేజ్ కు చోటు దక్కలేదు. ప్రస్తుతం వీరంతా జింబాబ్వేలో ఐసీసీ ప్రపంచ కప్ 2023 క్వాలిఫయర్స్ టోర్నీలో బిజీగా ఉన్నారు.
జూన్9న ఈ టోర్నీ ముగిసిన తర్వాత సన్నాహక శిబిరంలో చేరే ఈ ఆటగాళ్లు ప్రధాన టెస్ట్ జట్టులో భాగమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ఆంటిగ్వాలో ప్రారంభమయ్యే ఈ శిబిరంలో పాల్గొనే జట్టుకు కెప్టెన్ గా క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఎంపికయ్యాడు. రెగ్యులర్ టెస్టు ఆటగాళ్లు జెర్మైన్ బ్లాక్‌వుడ్, టాగెనరైన్ చందర్‌పాల్, రఖీమ్ కార్న్ వాల్, జాషువా డిసిల్వా, షనన్ గాబ్రియెల్, కీమర్ రోచ్ తదితరులు శిబిరంలో పాల్గొంటారు.
భారత టెస్టులకు వెస్టిండీస్ ప్రాథమిక జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథానాజ్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, న్క్రుమా బోన్నర్, టాగెనరైన్ చందర్‌పాల్, రఖీమ్ కార్న్ వాల్, జాషువా డిసిల్వా, షనన్ గాబ్రియెల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డన్, జైర్ మెక్‌అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, ఆండర్సన్ ఫిలిప్, రేమాన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్.