వందేభారత్ రైళ్లలో నెం.1 ఇదే!
- ప్రజాదరణ చూరగొంటున్న వందేభారత్ రైళ్లు
- 183 % ఓఆర్‌తో దేశంలోనే నెం.1గా నిలిచిన కాసర్‌గోడ్-తిరువనంతపురం సర్వీసు
- ఆ తరువాతి స్థానంలో తిరువనంతపురం-కాసర్‌గోడ్ సర్వీసు
- ప్రకటించిన రైల్వే శాఖ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందేభారత్ రైలు సర్వీసులకు ప్రజల్లో మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. వేగవంతమైన ప్రయాణం, అద్భుతమైన వసతులు వెరసి ఈ రైళ్లకు ప్రజాదరణ దక్కింది. ప్రస్తుతం దేశంలో 23 జతల వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.
అయితే, వీటిల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన సర్వీసు కేరళలోని కాసర్‌గోడ్-తిరువనంతపురం వందేభారత్ అని రైల్వే వర్గాలు తాజాగా ప్రకటించాయి. ఏకంగా 183 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో(ఓఆర్) ఈ రైలు వందేభారత్ సర్వీసులన్నిటికంటే ముందు నిలిచింది. ఆ తరువాత 176 % ఆక్యుపెన్సీ రేషియోతో తిరువనంతపురం-కాసర్‌గోడ్ రైలు సర్వీసు రెండో స్థానంలో నిలిచింది. గాంధీనగర్-ముంబై సెంట్రల్(134%), ముంబై సెంట్రల్-గాంధీనగర్(129%), రాంచీ-పాట్నా(127%), న్యూఢిల్లీ-వారణాసి(124%), ముంబై- షోలాపూర్(111%), డెహ్రాడూన్-అమృత్‌సర్(105%) వందేభారత్ రైళ్లు ఆ తరువాతి స్థానాల్లో వరుసగా నిలిచాయని రైల్వే శాఖ ప్రకటించింది.