టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులకు ఉచితం: లోకేశ్
- గూడూరు నియోజక వర్గంలో లోకేశ్ యువగళం
- కాకువారిపాలెం క్యాంప్ సైట్ లో యువతతో ముఖాముఖి
- టీడీపీ వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఖాయమన్న లోకేశ్
- ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ద్వారా ఉపాధి కల్పిస్తామని భరోసా
- జగన్ కంస మామగా మారిపోయాడని విమర్శలు
- చంద్రన్న రైతు బాంధవుడు అని వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 141వ రోజు గూడూరు నియోజకవర్గం కాకువారిపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర... బల్లవోలు కొత్తపాలెం క్రాస్, చింతవరం, మొగలి కొత్తపాలెం, అల్లీపురం, ఏరూరు, మోమిడి మీదుగా వరగలి విడిది కేంద్రానికి చేరుకుంది.
జగన్ రెడ్డి ధనదాహం... ప్రకృతి వనరుల విధ్వంసం!
గూడూరు నియోజకవర్గంలో అక్రమ సిలికా తవ్వకాలను పరిశీలించిన లోకేశ్ సెల్ఫీ దిగుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది గూడూరు నియోజకవర్గం బల్లవోలు సమీపంలో వైసీపీ దొంగల అక్రమ సిలికా శాండ్ తవ్వకాల దృశ్యం అని వెల్లడించారు. సోన కాల్వలు నాశనం చేసి అక్రమ మైనింగ్ చేస్తూ జగన్ అండ్ కో రూ.5 వేల కోట్ల దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. పేదల నోటికాడ కూడు లాగేసినా, పర్యావరణ విధ్వంసం జరిగినా డోన్ట్ కేర్... తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నిండటమే జగన్ రెడ్డి గారి ఏకైక టార్గెట్ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
అందుకే రైతుబాంధవుడు చంద్రన్న!
పాదయాత్ర దారిలో స్ప్రింకర్ల ద్వారా పండిస్తున్న వేరుశెనగ పంటను పరిశీలించిన లోకేశ్ సెల్ఫీ దిగుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎడారి నేలల్లో సైతం బంగారు పంటలు పండించే నేర్పు ఆంధ్రప్రదేశ్ లోని అన్నదాతలకు మాత్రమే సొంతం అని కొనియాడారు.
"గూడూరు నియోజకవర్గం బల్లవోలు సమీపాన సముద్ర తీర ప్రాంత భూములకు ఎటువంటి సాగునీటి సౌకర్యం అందుబాటులో లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజనరీ లీడర్ చంద్రబాబు చొరవతో ఇక్కడి రైతులు డ్రిప్ స్ప్రింకర్లు ఏర్పాటుచేసుకొని వేరుశనగ పంట పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మైక్రో ఇరిగేషన్ కు రూ.1,250 కోట్లు ఖర్చుపెట్టిన రైతు బాంధవుడు చంద్రన్న" అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.
యూనివర్సిటీలను పునరావాస కేంద్రాలుగా మార్చిన జగన్
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. కెరియర్ కౌన్సిలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గూడూరు నియోజకవర్గం కాకువారిపాలెం క్యాంప్ సైట్ వద్ద యువతతో నిర్వహించిన ముఖాముఖిలో లోకేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయం ఉపాధి, ప్రైవేట్, ప్రభుత్వ రంగాల ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.
"నిరుద్యోగ యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తాం. టీడీపీ హయాంలో ప్రైవేట్ రంగంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది అని వైసీపీ ప్రభుత్వమే శాసన మండలి సాక్షిగా ప్రకటించింది. మరో రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ, స్వయం ఉపాధి ద్వారా కల్పించాం. టీడీపీ ఐదేళ్ల పాలనలో మొత్తం 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. జాతీయ విద్యా విధానం పేరుతో జగన్ స్కూల్స్ ఎత్తేస్తున్నాడు. ఎన్నికల ముందు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం అని మోసం చేశాడు. ఇప్పుడు ఏకంగా ఉన్న టీచర్ పోస్టులు తగ్గిస్తున్నాడు" అని ఆరోపించారు.
జగన్ కంస మామగా మారిపోయాడు!
చంద్రబాబు హయాంలో ఏపీ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంటే, జగన్ పాలనలో ఏపీ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా మారిపోయింది. ఒక్క గంజాయికి తప్ప ఏపీలో మరే ఇతర పంటకు గిట్టుబాటు ధర లేదు. వైసీపీ నేతలు యువతను గంజాయికి బానిసలుగా మారుస్తున్నారు.
యువతకు నేను ఇస్తున్న పిలుపు సే నో టు గంజాయి... గంజాయి వద్దు బ్రో. ఎన్నికల ముందు మేనమామ అన్న జగన్ ఎన్నికల తరువాత కంస మామగా మారాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలి. జగన్ యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశాడు.
హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తాం!
సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవసరమైన డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం. జగన్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని భ్రష్టు పట్టించింది. వసతి దీవెన, విద్యా దీవెన వలన తల్లిదండ్రులు ఒత్తిడికి లోనవుతున్నారు.
పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ జగన్ తెచ్చిన జీవో నెం.77ని టీడీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి వంద రోజుల్లోనే రద్దు చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు సింగిల్ సెటిల్మెంట్ చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తాం.
ఫిజియోథెరపీ కోర్సుకి కూడా సరైన గుర్తింపు ఇస్తాం. జగన్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతాం.
*యువగళం వివరాలు:*
*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1853 కి.మీ*
*ఈరోజు నడిచిన దూరం – 17.8 కి.మీ.*
*142వ రోజు పాదయాత్ర వివరాలు(30-6-2023)*
*గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం, (తిరుపతి జిల్లా)*
సాయంత్రం
4.00 - వరగలి శివారు క్యాంప్ సైట్ నుండి పాదయాత్ర ప్రారంభం
4.40 – వరగలిలో గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం.
5.30 – లింగవరంలో స్థానికులతో మాటామంతీ
6.00 – సింహపురి పవర్ ప్లాంట్ వద్ద స్థానికులతో సమావేశం
6.20 – తమిళపట్నం హెచ్.డబ్ల్యూ వద్ద మత్య్సకారులతో సమావేశం
6.40 – తమ్మినపట్నం వద్ద స్థానికులతో సమావేశం
6.55 – గుమ్మలదిబ్బ వద్ద స్థానికులతో మాటామంతీ
7.15 – కృష్ణపోర్టు దక్షిణ ద్వారం వద్ద సర్వేపల్లి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం
9.15 – కృష్ణపట్నం ఉత్తర ద్వారం వద్ద గుండా పోర్టు పరిధిలో పాదయాత్ర
9.20 – గోపాలపురం వద్ద స్థానికులతో మాటామంతీ
9.25 – గోపాలపురంలోని విడిది కేంద్రంలో బస
******