రోడ్డు మార్గంలో పోలీసులు అడ్డుకోవడంతో హెలికాప్టర్ లో వెళ్లిన రాహుల్ గాంధీ
- రెండు జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్
- ఇంఫాల్ నుంచి చురాచాంద్ పూర్ కు రోడ్డు మార్గంలో వెళ్తున్న రాహుల్ ను అడ్డుకున్న పోలీసులు
- పోలీసుల సూచన మేరకు హెలికాప్టర్ లో వెళ్లిన రాహుల్
జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ ఎట్టకేలకు హింస ప్రజ్వరిల్లిన జిల్లాల్లో ఒకటైన చురాచాంద్ పూర్ కు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో పాలీసులు అడ్డుకోవడంతో ఆయన హెలికాప్టర్ లో వెళ్లారు. ఈ ఉదయం రోడ్డు మార్గంలో ఇంఫాల్ నుంచి రాహుల్ బయల్దేరిన సంగతి తెలిసిందే.
అయితే, ఇంఫాల్ నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణించిన రాహుల్ ను బిష్ణుపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని, రోడ్డు మార్గంలో వెళ్లడం సురక్షితం కాదని, హెలికాప్టర్ లో వెళ్లాలని పోలీసులు సూచించారు. వారి సూచన మేరకు ఇంఫాల్ కు తిరిగి వచ్చిన రాహుల్... హెలికాప్టర్ లో చురాచాంద్ పూర్ కు చేరుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 300 రిలీఫ్ క్యాంపుల్లో 50 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు.