జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు: గంటా శ్రీనివాసరావు
- అమ్మఒడి పథకంలో జగన్ మాట తప్పారన్న గంటా
- సగం మందికే డబ్బులు ఇచ్చారని విమర్శ
- టీడీపీ బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందని వ్యాఖ్య
అమ్మఒడి పథకంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఈ పథకం ద్వారా కేవలం సగం మందికి మాత్రమే డబ్బులు ఇచ్చారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని... ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పారు. తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ వ్యతిరేకం కాదని అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గంటా అన్నారు. విశాఖ ఎంపీ సభ్యులనే కిడ్నాప్ చేయడం దీనికి ఉదాహరణ అని చెప్పారు. టీడీపీ చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేసి మళ్లీ సీఎం చేయాలని ప్రజలు ఉత్సుకతతో ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు గుడ్ బై చెపుతారని అన్నారు.