తిరుమల ఆలయంపై మరోసారి విమానాల కలకలం

తిరుమల ఆలయంపై మరోసారి విమానాల కలకలం
  • తిరుమల కొండపై విమానాలు ఎగరడం ఆగమశాస్త్రానికి వ్యతిరేకం
  • ఇటీవల తరచుగా తిరుమల గగనతలంలోకి విమానాలు
  • నేడు రెండు విమానాలు రాక
  • ఆలయ పవిత్రతపై భక్తుల ఆందోళన
ఇటీవల కాలంలో తిరుమల కొండపై విమానాలు వెళ్లిన ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయం, పరిసరాలపై విమానాలు ప్రయాణించడం నిషిద్ధం. అయితే, గత కొన్ని నెలల వ్యవధిలోనే పలుమార్లు వెంకన్న ఆలయంపై విమానాలు వెళ్లడం కలకలం సృష్టించింది. 

తాజాగా, మరోసారి ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు పొడిచేలా, రెండు విమానాలు తిరుమల గగనతలంలోకి ప్రవేశించాయి. ఓ విమానం ఆలయ గోపురం, గొల్ల మంటపానికి మధ్యలో ప్రయాణించింది. మరో విమానం ఆలయ సమీపం నుంచి వెళ్లింది. 

తిరుమల క్షేత్రంపైకి విమానాలు రాకూడని టీటీడీ చెబుతున్నా కేంద్ర విమానయాన శాఖ పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. తాజా ఘటనలో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. తిరుమల కొండపైకి విమానాలు రావడం ఆలయ పవిత్రతకు భంగం కలిగించడమేనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News