భద్రత విషయమై ఈటల నివాసానికి పోలీసులు

భద్రత విషయమై ఈటల నివాసానికి పోలీసులు
  • భద్రత విషయంలో ఈటలతో చర్చించిన డీసీపీ సందీప్ రావు
  • డీజీపికి నివేదిక అందజేయనున్న డీసీపీ 
  • ఈటల హత్యకు కుట్ర జరుగుతోందని భార్య ఆరోపణ 
బీజేపీ అగ్ర నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై రాష్ట్ర పోలీసు శాఖ దృష్టి పెట్టింది. ఈటల హత్యకు కుట్ర జరిగిందంటూ ఆయన భార్య జమున తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం స్పందించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో గురువారం ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన డీసీపీ సందీప్ రావు ఆయన భద్రత విషయంలో అరగంట పాటు చర్చించారు. ఈటల భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీ కుమార్ కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ చెప్పిన అంశాలను డీజీపీకి వివరిస్తామని సందీప్ రావు తెలిపారు. కాగా, రాజేందర్‌‌కు భద్రత పెంపుపై డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో ఇప్పటికే సమీక్ష జరిగింది.


More Telugu News